Home » vande bharat express
రివర్బెడ్కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.
ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు నిర్ణయించిన రూ.30 వేల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీ-హై-స్పీడ్ రైల్వే సర్వీస్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express) తయారీ, నిర్వహణ కోసం ఈ టెండర్‌ను పిలిచారు.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.
రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.
వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరుపుతున్న రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలును ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు రాకపోకలు సాగిస్తుండగా ఇది రెండవది.
జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.