Vande Bharath Express: వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్...
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:22 AM
సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్‌లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంతకల్లు(అనంతపురం): కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express)ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సపీఎన్ స్టేషన్‌లో రెండు నిమిషాలసేపు స్టాపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఈ రైలు వేళలను కూడా సవరించినట్లు తెలిపారు. కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (నం. 22231) ఉదయం 5-15 గంటలకు కలబురగిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరేది.
ఇకపై ఈ రైలు ఉదయం 6-10 గంటలకు బయలుదేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 22232) బెంగళూరులో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి, మునుపటి సమయంలోనే గమ్యస్థానానికి చేరుతుందన్నారు. ఇదేవిధంగా యశ్వంతపూర్-మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్ (నం. 17212) బెంగళూరులో జనవరి 1 నుంచి మధ్యాహ్నం 1-15 గంటలకు కాకుండా 12-45 గంటలకే బయలుదేరుతుందన్నారు.

కానీ గమ్యస్థానానికి యథా ప్రకారంగానే చేరుతుందన్నారు. బెంగళూరు-భువనేశ్వర్ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (నం. 18464)ను గిద్దలూరు స్టేషన్ నుంచి డోన్ స్టేషన్ వరకూ సమయాలను మార్పుచేసినట్లు తెలియజేశారు. ముంబై-కోయంబత్తూరు కుర్లా ఎక్స్‌ప్రెస్ (నం. 11013) జనవరి 1 నుంచి ధర్మవరం నుంచి ధర్మపురం స్టేషన్ వరకూ వేళలను స్వల్పంగా మార్పుచేసినట్లు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News