• Home » Anantapur

Anantapur

Drinking Water: అనంతపురంలో దారుణం.. తాగునీటి కోసం హత్య..

Drinking Water: అనంతపురంలో దారుణం.. తాగునీటి కోసం హత్య..

తాగునీటి కుళాయి వద్ద చోటుచేసుకున్న గొడవ కారణంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. వేట కొడవలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

మండలకేంద్రంలో బస్‌ షెల్టర్‌ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్‌ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.

RDO: వాల్టాను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో

RDO: వాల్టాను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో

వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్‌ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్‌ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.

FORMER MINISTER: పేదలకు తోడ్పాటు అందించాలి

FORMER MINISTER: పేదలకు తోడ్పాటు అందించాలి

ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్‌ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.

OFFICES: ఒకే గదిలో మూడు సచివాలయాలు

OFFICES: ఒకే గదిలో మూడు సచివాలయాలు

మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Palle Raghunath Reddy: మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Palle Raghunath Reddy: మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

Ananthapur News: నకిలీ సిమెంట్‌ బాగోతం గుట్టురట్టు..

Ananthapur News: నకిలీ సిమెంట్‌ బాగోతం గుట్టురట్టు..

నకిలీ సిమెంట్‌ బాగోతం గుట్టురట్టయింది. గత 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

MEO  ఎంఈఓ రామచంద్రపై సస్సెన్షన ఎత్తివేత

MEO ఎంఈఓ రామచంద్రపై సస్సెన్షన ఎత్తివేత

రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట ఎంఈఓ-2 రామచంద్రపై సస్పెన్షన ఎత్తివేశారు. ఈయన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీ హైస్కూల్‌ హెచఎంగా ఉన్న సమయంలో నాడు, నేడు పనుల్లో అక్రమాలు జరిగాయని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి