Drinking Water: అనంతపురంలో దారుణం.. తాగునీటి కోసం హత్య..
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:23 AM
తాగునీటి కుళాయి వద్ద చోటుచేసుకున్న గొడవ కారణంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. వేట కొడవలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగు నీటి విషయంలో గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా వేట కొడవలితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లుకు చెందిన కురుబ చంద్ర అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తితో గొడవైంది. తాగునీటి కుళాయి వద్ద చోటుచేసుకున్న ఆ గొడవతో చంద్రపై శివ కక్ష పెంచుకున్నాడు. హత్య చేయడానికి పథకం వేశాడు.
ఈ నేపథ్యంలోనే వేట కొడవలితో చంద్రపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. దాడి అనంతరం శివ అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చంద్ర మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!