Share News

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

ABN , Publish Date - Jul 22 , 2025 | 08:02 AM

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌- విశాఖపట్నం(Secunderabad-Visakhapatnam) మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.


city1.2.jpg

దీంతో ఆగస్టు 25నుంచి ఏలూరు(Eluru)లో, 20833/20834 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‏లకు ఆగస్టు 2నుంచి సామర్లకోట(Samarlakota)లో అదనపు స్టాపేజీలు మరో ఆరునెలల పాటు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.


city1,2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

జోరుగా వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 22 , 2025 | 10:33 AM