Trains: విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సహా ప్రధాన రైళ్లు రద్దు
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:12 PM
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని
- జనవరిలో పలు ప్రధాన రైళ్లు రద్దు
విశాఖపట్నం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708); 28, 29 తేదీల్లో విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805), మచిలిపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219); 29న విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), 29, 30 తేదీల్లో లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806),

విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), 28, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239), 29, 31 తేదీల్లో విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718), విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్ (67286), జనవరి 31న గుంటూరు-విశాఖ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876), విశాఖ-గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22575) రద్దు కానున్నట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News