Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:01 PM
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.
- అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి
చెన్నై: బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే సూచించింది. ప్రస్తుతం శబరిమల(Shabarimala) సీజన్ కావడంతో మాలధారణ చేసిన భక్తులు శబరిమలకు వెళ్తున్నారు. మాలధారణ చేసిన భక్తులు ఉదయం, సాయంత్రం పుణ్యస్నానాలు ఆచరించి, శరణు ఘోష చేస్తుంటారు. ఆ సమయంలో, స్వామివారికి హారతులిస్తుంటారు. ఈ క్రమంలో, శబరిమలకు రైళ్లలో వెళ్తున్న భక్తులు హారతులిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.

రైళ్లలో అగ్నిప్రమాదాలు సంభవించే వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం కారణంగా, అయ్యప్ప భక్తులు రైలు బోగీల్లో హారతులివ్వరాదని దక్షిణ రైల్వే విజ్ఞప్తి చేసింది. ఆ ప్రకారం సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో అయ్యప్ప భక్తులకు ఈ విషయమై రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News