Home » Chennai News
మద్యం సేవించి ఇంటికొచ్చిన కుమారులను తల్లి మందలించడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మవారపాళయం గ్రామానికి చెందిన జయలక్ష్మి, పెద్ద కుమారుడు విఘ్నేష్ (28), చిన్న కుమారుడు గణేష్ (24) శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.
దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఓనం పండుగను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పర్యటించారు.
డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్ వాకింగ్‌కు వెళ్తుండగా ఓపీఎస్ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.
గ్రామాల్లో చిరువ్యాపారులకు లైసెన్స్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని వాణిజ్య దుకాణాలకు లైసెన్స్ ఉన్నట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు కూడా లైసెన్స్ పొందాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్‌గా దీపక్ జాకబ్, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్‌గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్ డైరెక్టర్‌గా కవితా రాము నియమితులయ్యారు.
రాష్ట్రంలో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోంది. డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో 10 జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది.
రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిన అన్నాడీఎంకే పథకాలను అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు.