Share News

Namo Bharat trains: సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..

ABN , Publish Date - Nov 25 , 2025 | 08:05 PM

నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు.. అంతకు మించి సందడిని అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇరుకైన ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో ఫంక్షన్లు చేసుకుని బోర్ కొడుతోందా? అయితే మీ వేడుకలకు ఇకపై నమో భారత్ రైళ్లు వేదికలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

Namo Bharat trains: సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..
Namo Bharat events

నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు.. అంతకు మించి సందడిని అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇరుకైన ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో ఫంక్షన్లు చేసుకుని బోర్ కొడుతోందా? అయితే మీ వేడుకలకు ఇకపై నమో భారత్ రైళ్లు వేదికలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) తాజాగా ఒక క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది (Namo Bharat events).


అత్యంత వేగవంతమైన 'నమో భారత్ ట్రైన్స్' (Namo Bharat trains) ఇకపై కేవలం ప్రయాణానికే కాదు.. సెలబ్రేషన్స్‌కు కూడా వేదికగా మారుతున్నాయి. సినిమా షూటింగ్‌లు, బర్త్ డే వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్లు.. ఇలా వేడుక ఏదైనా మీరు నమో భారత్ రైళ్లను వేదికలుగా మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వేడుకల కోసం మీరు నమో భారత్ రైళ్లను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంది. అభిరుచికి తగ్గట్టుగా నమో భారత్ కోచ్‌లను బుక్ చేసుకునే వీలుంది (train rentals India).


కదిలే రైలులో పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా ? లేక స్టేషన్‌లో ఆగిన రైలులో ఈవెంట్ ప్లాన్ చేస్తారా? అనేది మీ ఇష్టం. ఈ రెండు వేదికలు మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఫొటోషూట్స్ కోసమైతే దుహై డిపో (Duhai Depot)లో ప్రత్యేకంగా ఒక 'మాక్-అప్ కోచ్' కూడా ఉంది. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు. దీని అద్దె గంటకు రూ.5,000 నుంచి మొదలవుతుంది (Indian rail event spaces).


ప్రస్తుతం ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ (RRTS) కారిడార్ రూట్‌లో ఈ సదుపాయం ఉంది. ఆనంద్ విహార్, ఘజియాబాద్, సాహిబాబాద్, మీరట్ సౌత్ స్టేషన్ల ఆర్కిటెక్చర్ చాలా ఆధునికంగా ఉండటంతో ఫొటోషూట్స్‌కు బెస్ట్ ఛాయిస్‌గా మారనున్నాయి. అయితే వేడుకల సమయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రైలు ఇంటీరియర్స్‌ను, స్టేషన్ ఆస్తులను పాడుచేసే వస్తువులను వాడకూడదు. డెకరేషన్ చాలా సింపుల్ గా ఉండాలి. మీ సెలబ్రేషన్స్ వల్ల రెగ్యులర్ ప్రయాణికులకు, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు.


ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 08:05 PM