Share News

Viral video: ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:01 PM

అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా స్పీడ్ డ్రైవింగ్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది.

Viral video: ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..
Road Accident

అతి వేగం (Speed) అత్యంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. అయినా యువకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్లినా, సందుల్లో నడుపుతున్నా వేగాన్ని మాత్రం తగ్గించరు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఆ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి (Girl) పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ (Scooty) నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి ఓ గ్రామంలోని రోడ్లపై స్కూటీ మీద ప్రయాణం చేస్తోంది. ఆమె స్కూటీ మీద వెళ్తుండగా వెనుక బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ యువతి క్రమంగా తన స్కూటీ స్పీడ్ పెంచింది. గడ్డి పై నుంచి కూడా అంతే స్పీడ్‌గా వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్కూటీ బ్యాలెన్స్ తప్పినా నిలదొక్కుకుంది. ఆ తర్వాత టర్నింగ్ వచ్చినపుడు మాత్రం ఆ స్పీడ్‌లో ఆమె నియంత్రించుకోలేకపోయింది. దీంతో బైక్‌తో సహా కింద పడిపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.7 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హఠాత్తుగా ఆమెకు ఏమైంది``, ``అబ్బాయిలు ఫాలో అవుతున్నారని ఆమె అలా స్పీడ్ పెంచినట్టుంది``, ``చాలా స్టైల్‌గా పడింది``, ``ఆమెకు దెబ్బలు గట్టిగా తగిలి ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral video: ఆహా.. ఈ ఎమ్మెల్యే ఎంత మంచివాడు.. డ్రైవర్ పెళ్లికి హాజరై ఏం చేశాడో తెలిస్తే సలాం కొట్టాల్సిందే..


Viral Video: వావ్.. ఈ ఎలుగుబంటి చాలా తెలివైంది.. కార్ డోర్ ఎలా తీసిందో చూడండి.. తర్వాత ఏం చేసిందంటే..


IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో రెండు తప్పులు ఉన్నాయి.. 10 సెకెన్లలో కనుక్కోండి..


Viral Video: ఛీ.. ఛీ.. ఇండియా గేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన.. రీల్స్ కోసం నడిరోడ్డుపై టవల్‌తో డ్యాన్స్..


Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 22 , 2024 | 12:01 PM