Viral video: ఆహా.. ఈ ఎమ్మెల్యే ఎంత మంచివాడు.. డ్రైవర్ పెళ్లికి హాజరై ఏం చేశాడో తెలిస్తే సలాం కొట్టాల్సిందే..
ABN , Publish Date - Nov 22 , 2024 | 09:38 AM
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ధన్‌ఘటా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చంద్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఓ ఎమ్మెల్యే (MLA) తన మంచి మనసును చాటుకున్నారు. తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్ (Driver)కు జీవితంలో మర్చిపోలేని బహుమతి అందించారు. పెళ్లికి (Wedding) స్వయంగా హాజరు కావడమే కాకుండా, ఎంతో మంచి పని చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ధన్‌ఘటా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చంద్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
యూపీలోని ధన్‌ఘటా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ తన డ్రైవర్ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు.. వరుడు కూర్చున్న కారును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే గణేష్ దగ్గర విపిన్ మౌర్య అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వివాహం కుదిరింది. పెళ్లి ఊరేగింపు నిర్వహించడానికి తన కారును మౌర్యకు ఇవ్వడమే కాకుండా ఆయన స్వయంగా దానిని నడిపారు. కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివిధ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే సింప్లిసిటీ, డ్రైవర్‌పై ఆయనకున్న అభిమానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ``నిజంగా ఆయన గొప్ప మానవత్వం కలిగిన మనిషి``, ``ప్రజాప్రతినిధులు ఇలాగే ఉండాలి``, ``మనిషిని మనిషిగా చూడడం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో రెండు తప్పులు ఉన్నాయి.. 10 సెకెన్లలో కనుక్కోండి..
Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి