Home » Secunderabad
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసిన సంచలన విషయాలు ఏబీఎన్ చేతికొచ్చాయి.
'సృష్టి' కేసులో అరెస్టయిన నిందితులను ఆదివారం మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తనపై దాడి చేయించింది అతడే అంటూ తన పార్టీలోని ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలను ఏబీఎన్‌తో వెల్లడించారు.
Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు.
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.