Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:00 AM
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
సికింద్రాబాద్: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి బాలంరాయ్ వరకు రహదారిని మూసివేస్తున్నామన్నారు. బాలంరాయ్ నుంచి సీటీవో జంక్షన్‌కు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
బాలనగర్ వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు తాడ్‌బంద్ మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్ కుడివైపు మలుపు తిరిగి మడ్‌ఫోర్ట్, ఎన్‌సీసీ, జేబీఎస్, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వారు సేఫ్ ఎక్స్‌ప్రెస్ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, మడ్‌ఫోర్ట్, ఎన్‌సీసీ, జేబీఎస్, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్ రాణిగంజ్, పంజాగుట్ట, రసూల్‌పురా,

ప్లాజా వైపు నుంచి సీటీఓ జంక్షన్ ద్వారా తాడ్‌బంద్ వైపు వెళ్లేవారు రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి అన్నానగర్, బాలంరాయ్, తాడ్‌బంద్ ద్వారా పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మార్గాలను ఉపయోగించాలని జాయింట్ సీపీ సూచించారు. ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలను చూడవచ్చని, ప్రయాణ సమయంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కి కాల్ చేయవచ్చన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News