Home » Traffic Police
రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్‌ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.
బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం, ముగ్ద జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
2026 న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 270 మందికి జైలు శిక్ష విధించారు. 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వందలాది మంది పట్టుబడ్డారు.
హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి పది గంటల నుంచి దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు.
అహ్మదాబాలోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వాహనదారుడిపై దాడి చేశాడు. కారులో ఉన్న యువకుడిని పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది.
హైదరాబాద్‌లో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. చలానా విధించారనే కోపంతో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.