Share News

Traffic constable attacked: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి..

ABN , Publish Date - Nov 30 , 2025 | 04:14 PM

హైదరాబాద్‌లో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. చలానా విధించారనే కోపంతో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Traffic constable attacked: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి..
traffic constable attacked

హైదరాబాద్‌లో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. చలానా విధించారనే కోపంతో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు (Saroor Nagar attack).


కొత్తపేట చౌరస్తా వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద వెళ్తున్న భరత్ అనే యువకుడిని ఆపారు. అతడికి చలానా విధించారు. చలాన్ వేయడం పట్ల భరత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముందు అక్కడి నుంచి వెళ్లిపోయి 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. రాయి తీసుకొచ్చి కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేశాడు (Hyderabad viral news).


అప్పారావు దగ్గరున్న ట్యాబ్‌ను ధ్వంసం చేశాడు (traffic police assault). దీంతో స్థానికులు భరత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంగిస్తున్నారు.. కవిత ఫైర్

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 04:14 PM