Home » Andhrapradesh
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్‌గేట్లకు పరిమితం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్‌లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్‌లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్ అలీపై షేక్ షమీమ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు ఆశ్రయించారు.
వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్‌లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, హెచ్‌ఎల్‌సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.
తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్‌గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు.
పరిపాలనలో రెవెన్యూ శాఖ పెద్దన్న పాత్ర పోషిస్తోందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో శుక్రవారం రాత్రి రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ శివ్‌నారాయణ్‌శర్మ, డీఆర్వో మలోల పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు.