Share News

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 PM

పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

- అర్హులకు పక్కాగృహాలు మంజూరు చేస్తాం

- రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

రొద్దం(అనంతపురం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమల సృష్టికర్త అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత(Minister Savitha) పేర్కొన్నారు. రొద్దం మండలంలోని సానిపల్లిలో వృద్ధులు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా ఇంటివద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. కియా లాంటి పరిశ్రమలో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఎంఎ్‌సఎంఈలతో రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.


pandu4.2.jpg

ఫిర్యాదుల స్వీకరణ..

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తామనీ మంత్రి సవిత అన్నారు. సోమవారం రొద్దంలోని వెలుగు కార్యాలయంలో డివిజన్‌స్థాయి ఫిర్యాదుల దినోత్సవం నిర్వహించారు. ప్రజా సమస్యలపై వందలాది మంది తరలిరాగా మంత్రి ప్రతి ఒక్కరి సమస్య వింటూ సంబందిత శాఖాధికారులతో సమస్యకు పరిష్కారం చూపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్‌ ఉదయశంకర్‌రాజు, ఎంపీడీఓ ఆనంద్‌ ప్రసాద్‌, టీడీపీ నాయకులు మాధవనాయుడు, వెంకటరామిరెడ్డి, వీరాంజనేయులు, హరీష్‌, పవన్‌, శ్రీనాథ్‌చౌదరి, అరుణ్‌కుమార్‌ రెడ్డి, అశ్వత్థనారాయణ, తిరుపాల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 02 , 2025 | 12:13 PM