Share News

IBomma Ravi: ఐ బొమ్మ రవి.. కస్టడీ రివిజన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Dec 12 , 2025 | 09:38 PM

ఐ బొమ్మ రవి కస్టడీకి ఎక్కువ సమయం ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవరం విచారణ జరిగింది.

IBomma Ravi: ఐ బొమ్మ రవి.. కస్టడీ రివిజన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్

హైదరాబాద్, డిసెంబర్ 12: ఐ బొమ్మ రవి కస్టడీకి ఎక్కువ సమయం ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవరం సైతం విచారణ జరిగింది. ఐ బొమ్మ రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని అతడి తరఫు న్యాయవాది శ్రీనాథ్ కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే రెండు సార్లు ఐ బొమ్మ రవిని పోలీసులు కస్టడీకీ తీసుకున్నారని కోర్టును తెలిపారు. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్ వర్క్ వెలుగులోకి వస్తుందని కోర్టు దృష్టికి సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు ఈ రోజు పూర్తయ్యాయి. రివిజన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పును డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.


ఇటీవల ఒక కేసులో ఐ బొమ్మ రవిని 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. మరో నాలుగు కేసుల్లో అతడిని కస్టడీకి పోలీసులు కోరారు. దాంతో 4 రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ విచారణ సమయం సరిపోదని.. మరో కొన్ని రోజులు అతడికి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలును కోర్టు విని.. తీర్పును 16వ తేదీకి వాయిదా వేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన చలి.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు

విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్

For More TG News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 09:45 PM