Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:41 PM
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’లో భాగంగా శనివారం కోల్‌కతాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో కలిసి తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సి ఆవిష్కరించాడు. అయితే ఈ సందడి నడుమ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మెస్సి(Lionel Messi) అభిమానులంతా ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే?
మెస్సి.. ప్రపంచ స్థాయిలో ఎంతో మంది అభిమానులు ఆయన సొంతం. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తుండటం.. ఇటీవలే ఫిఫా ప్రపంచ కప్ సొంతం చేసుకోవడంతో మెస్సిని చూడాలని అభిమానులు తహతహలాడారు. ఆయన కోసం గంటలు గంటలుగా ఎదురు చూశారు. కానీ ఆయన ఎంతో సేపు అక్కడ లేకపోవడంతో అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆడుతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్ అంతా నిరసన తెలుపుతున్నారు. మెస్సి కోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నామని.. మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు. కోల్‌కతా స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్
గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు