Home » Kolkata
అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కోల్‌కతా నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు కోల్‌కతాలో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
కోల్‌కతాలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.4గా నమోదైంది.
తుర్కియే ఎయిర్‌లైన్స్ విమానం కోల్‌కతాలో బుధవారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 236 మంది ప్రయాణిస్తున్నారు.
కోల్‌కతా నగరంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది..
కోల్‌కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను ఈడీ శుక్రవారంనాడు ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి కేంద్రీకరించింది. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని.. వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు.
సంఘ్‌కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ 'మహా జంగిల్ రాజ్'కు బీజేపీ చరమగీతం పాడుతుందని మోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు.