Share News

Sourav Ganguly Defends Curator: క్యురేటర్‌కు మద్దతుగా నిలిచిన గంగూలీ

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:53 PM

కోల్‌కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ స్పందించాడు.

Sourav Ganguly Defends Curator: క్యురేటర్‌కు మద్దతుగా నిలిచిన గంగూలీ
Sourav Ganguly

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమిండియా (Team India) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. దీంతో 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు ఓ రేంజ్ లో బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. బాల్ ను టచ్ చేయడానికి బ్యాటర్లు భయపడ్డారు అంటే... ఏ రేంజ్ లో పిచ్(Kolkata Test pitch) మార్పు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది.


కోల్‌కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్‌(Kolkata Test pitch criticism)పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు. ఈ విషయంలో అతడు క్యురేటర్‌ సుజన్‌ ముఖర్జీకి మద్దతుగా నిలిచాడు. టీమిండియా మేనేజ్మెంట్ కోరిక మేరకే పిచ్‌ను రూపొందించినట్లు వివరించాడు. భారత శిబిరం ఎలాంటి పిచ్‌ను కోరుకుందో అలాంటిదే రూపొందించామని తెలిపాడు. పిచ్‌పై మ్యాచ్‌కు ముందు నాలుగు రోజులుగా నీళ్లు అప్లయ్ చేయలేదని, అందుకే అది ఇలా స్పందిస్తోందని, ఈ విషయంలో క్యురేటర్‌ ముఖర్జీని తప్పుపట్టలేమని దాదా స్పష్టం చేశాడు.


ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లలో ఏ ఒక్కటి కూడా రెండు వందల పరుగుల మార్క్‌ దాటలేదు. బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా(Temba Bavuma) ఒక్కడే (55*; 136 బంతులు) రెండో ఇన్నింగ్స్‌లో ఈ పిచ్‌పై పరుగులు చేయగలిగాడు. అందరూ అనుకున్నట్లే మూడు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్‌ ముగిసింది. ఈ నేపథ్యంలో పలువురు మాజీలు ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌(Kolkata Test pitch criticism)పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐసీసీ (ICC) నుంచి సైతం నాసిరకం (పూర్‌) రేటింగ్‌, డిమెరిట్‌ పాయింట్లు వచ్చే ప్రమాదముందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు.



ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

Gambhir's Experiment Failure: భారత్ కొంపముంచిన ప్రయోగాలు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 05:43 PM