Share News

WTC 2025-27 Points Table: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:27 PM

సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 పాయింట్స్ పట్టికలో భారత్ కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత్.. మరో స్థానం దిగజారి... నాలుగో స్థానంకు పడిపోయింది.

WTC 2025-27 Points Table: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్
India drops to 4th in WTC

కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్(India vs South Africa 1st Test)ఓటమి పాలైంది. తొలి టెస్టు మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 93 పరుగులకే ఆలౌటైంది. దీంతో 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 పాయింట్స్ పట్టిక(WTC 2025-27 points table)లో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత్.. మరో స్థానం దిగజారింది. కోల్ కతా టెస్టు ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది.


ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన రెండు పరాజయాలు, తాజాగా ప్రొటీస్ చేతిలో ఓటమి తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న WTC 2025-27 సైకిల్‌లో భారత్ మూడు టెస్టులను కోల్పోయింది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచింది. WTC 2025-27 ఎడిషన్ ఆడిన మూడు టెస్ట్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా(Australia)(100 విజయ శాతం) టాప్ లో ఉంది. ఆతర్వాత ఇప్పటి వరకు మూడు మ్యాచులకు గాను రెండు మ్యాచులు గెలిచిన సౌతాఫ్రికా(South Africa)(66.67 విజయ శాతం), 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో శ్రీలంక(66.67) ఉంది. ఈ జట్టు రెండు టెస్టు మ్యాచులు ఆడగా... ఒక మ్యాచులో గెలిచి, మరో మ్యాచ్ డ్రా అయింది. ఇక భారత్(54.17) , పాకిస్థాన్(50), ఇంగ్లాండ్(43.33) జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.


ఇక కోల్‌కతా టెస్టు మ్యాచ్(Kolkata Test result) విషయానికి వస్తే... కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగుల లోపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఇది రెండో ఓటమి. 21వ శతాబ్దంలో 150 పరుగుల లోపు టార్గెట్ ను ఛేదించే క్రమంలో మరే ఇతర జట్టు కూడా స్వదేశంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. గతేడాది వాంఖడే స్టేడియంలో ఆతిథ్య జట్టు భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అలానే ఈ మ్యాచ్ విజయంతో సౌతాఫ్రికా(South Africa) 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం విశేషం.


ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

Gambhir's Experiment Failure: భారత్ కొంపముంచిన ప్రయోగాలు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 05:19 PM