Share News

Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:15 PM

రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.

Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..
Caste Based Crime

రంగారెడ్డి జిల్లా: రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు. తమ కుమార్తో, కుమారుడో, సోదరో, సోదరుడో వేరే కులం అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకున్నారని కక్ష పెంచుకుంటున్నారు. అవకాశం చిక్కినప్పుడు వారి ప్రాణాలను తీస్తూ కుల అహంకారం చల్లార్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.


రంగారెడ్డి జిల్లా ఫరూక్‌ నగర్ మండలం ఎల్లంపల్లిలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను వేరే కులానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడని దారుణానికి పాల్పడ్డాడు సదరు యువతి తండ్రి. అయితే, ఇక్కడ కుమార్తెనో ఆమె భర్తను హత్య చేయలేదు. ఏకంగా యువకుడి కుటుంబంపై పడ్డాడు. వరుడి అన్నను కిడ్నాప్‌ చేయించి మరీ అతి కిరాతంగా హత్య చేయించాడు. వారిద్దరికీ పెళ్లి చేశాడని కక్ష పెంచుకుని.. అదును చూసి ప్రాణాలు తీసేశాడు.


అతని మరణ వార్త విన్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమకు పెళ్లి చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడని నవ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. హత్యోదంతం తెలిసి గ్రామస్థులంతా రోదనలో మునిగిపోయారు. ఇష్టపడిన వారిని కలపడమే అతను చేసిన పాపమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.


ఈ వార్త కూడా చదవండి:

MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్‌పై స్పందించిన కవిత..

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

Updated Date - Nov 16 , 2025 | 04:25 PM