Durgapur case: ఆడపిల్లలు రాత్రివేళల్లో కాలేజీ బయటకు వెళ్లకూడదు... మమత వ్యాఖ్యలపై దుమారం
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:32 PM
కోల్‌కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్‌లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్‌తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
కోల్‌కతా: దుర్గాపూర్‌లోని మెడికల్ కాలేజీ విద్యార్థిని సామూహిక హత్యాచారం ఘటన సంచలనం సృష్టించడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamamta Banerjee) తొలిసారి స్పందించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఈ ఘటన సంభవించినందున తన ప్రభుత్వాన్ని నిదించడం సరికాదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. కాలేజీ అధికారులు ఆమె భద్రతకు పూచీకత్తు వహించాల్సి ఉంటుందని, రాత్రి వేళ్లలో కాలేజీ బయటకు వెళ్లడానికి అమ్మాయిలను అనుమతించరాదని చెప్పారు.
అసలేం జరిగింది?
కోల్‌కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్‌లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్‌తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముక్కురు వ్యక్తులు ఆమె ఫోనును లాక్కుని, సమీపంలోని వుడెడ్ ఏరియాకు లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. అనంతరం ఆమె ఫోను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.
ముగ్గురి అరెస్టు
కాగా, ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితుల కోసం నిందితులను ప్రశ్నిస్తున్నామని, ఇది చాలా సెన్సిటివ్ కేసు అని అధికారులు తెలిపారు. సాక్ష్యాల సమీకరణకు ఘటనా స్థలికి ఫోరెన్సిక్ టీమ్ వెళ్లిందని, అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సమీక్షించనున్నామని దుర్గాపూర్ కమిషనరేట్ డీసీ (ఈస్ట్) అభిషేక్ గుప్తా తెలిపారు.
ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మమత ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. బాధితురాలి తండ్రిని కూడా ఆయన కలిసి న్యాయం కోరుతూ జరిపే పోరాటానికి బాసటగా ఉంటామని చెప్పారు.
బాధితురాలి పరిస్థితి
కాగా, బాధితురాలు బెడ్‌రెస్ట్ తీసుకుంటా నడవలేని పరిస్థితిలో ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాకు తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ముఖ్యమంత్రి, డీజీ, ఎస్పీ, కలెక్టర్ తమకు సాయం చేస్తున్నారని, అయితే ఇక్కడ ఆమె భద్రతకు ప్రమాదం ఉందనే కారణంగా ఆమెను ఒడిశా తీసుకువెళ్లాలని కోరామని చెప్పారు. మరోవైపు పోలీసు విచారణ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
For More National News And Telugu News