Home » Mamata Banerjee
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్లోని సాల్ట్ లేక్లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
India: పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాకు చెందిన ఓ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని బహిరంగంగా మమతా బెనర్జీ సవాలు చేశారు.
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. మైనారిటీలు, వారి ఆస్తులకు తాము కాపాడతామని అన్నారు.
ఫ్లోర్ టైమ్ బాధ్యత కలిగిన కల్యాణ్ బెనర్జీ లోక్సభలో తనకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడం లేదని మెుయిత్రా అసంతృప్తితో ఉన్నారు. పలు అంశాలపై మాట్లాడేందుకు మెుయిత్రా ముందుకు వచ్చినా కల్యాణ్ నిరాకరించినట్టు చెబుతున్నారు.