Home » West Bengal
బెల్డాంగలో ప్రతిపాదిత బాబ్రీ మసీదుకు కబీర్ శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఆయన నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడగానే పార్టీ నుంచి కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది.
రెజినగర్‌లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి కబీర్, పలువురు ఇస్లాం మతపెద్దలు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగినట్టు ప్రకటించారు. నారా-ఏ తక్బీర్, అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు.
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీఎమ్‌సీ నేత, కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ తెలిపారు.
వీధికుక్కలు వ్యవహించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పడే పుట్టిన పసికందును కన్నవాళ్లు రోడ్డు మీద వదిలేస్తే, ఆ చిన్నారి చుట్టూ చేరి తెల్లవార్లూ రక్షణ కవచంగా నిలిచి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాయి అక్కడి వీధి శునకాలు..
బీఎల్ఓ అధికార్ రక్షా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. బీఎల్ఓలకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలపై తీవ్రమైన పని ఒత్తిడి మోపుతున్నారని కమిటీ ఆరోపిస్తోంది.
బెంగాలీ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫిక్ ఎస్‌కే గత వారమంతా ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో సోఫిక్ సన్నిహితంగా ఉన్న ఓ వీడియో గత వారం సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో సోఫిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది.
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు.
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్‌లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మాణం చేపడతామంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సీఎం మమతా బెనర్జీ అభీష్టం మేరకే ఈ ప్రకటన వెలువడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బీఎల్ఓ ఆత్మహత్య నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం చేస్తున్న ప్రకటనలకు విశ్వసనీయత లేదని బీజేపీ మండిపడింది. స్వతంత్ర దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పింది.