Share News

Sofik SK MMS scandal: వైరల్ అయిన ఎమ్‌ఎమ్‌ఎస్ స్కాండల్.. స్పందించిన బెంగాలీ ఇన్‌ఫ్లుయెన్సర్..

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:58 PM

బెంగాలీ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫిక్ ఎస్‌కే గత వారమంతా ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో సోఫిక్ సన్నిహితంగా ఉన్న ఓ వీడియో గత వారం సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో సోఫిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది.

Sofik SK MMS scandal: వైరల్ అయిన ఎమ్‌ఎమ్‌ఎస్ స్కాండల్.. స్పందించిన బెంగాలీ ఇన్‌ఫ్లుయెన్సర్..
Sofik SK controversy

బెంగాలీ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫిక్ ఎస్‌కే గత వారమంతా ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో సోఫిక్ సన్నిహితంగా ఉన్న ఓ వీడియో గత వారం సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో సోఫిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది. రాత్రికి రాత్రే వేల మంది సోఫిక్ ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారు. తాజాగా ఆ వీడియోపై స్పందించిన సోఫిక్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు (Sofik SK new video).


ఆ వీడియో విషయంలో తనను కొందరు బ్లాక్ మెయిల్ చేశారని సోఫిక్ తెలిపాడు. ఎమ్‌ఎమ్‌ఎస్ వివాదం తర్వాత సోఫిక్ వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. 'ఆ వీడియో ఒక సంవత్సరం క్రితంది. నేను ఇప్పుడు మారిపోయిన వ్యక్తిని. నేను నా పనిపై మాత్రమే దృష్టి పెడుతున్నాను. నా అభివృద్ధిని సహించలేని కొంతమంది స్నేహితులు నా వీడియోను పోస్ట్ చేసి దానిని వైరల్ చేశారు' అని సోఫిక్ పేర్కొన్నాడు. తమ స్నేహితుడు తమ ఫోన్‌ల నుంచి వీడియో తీసి తమను బెదిరిస్తున్నాడని సోఫిక్ పేర్కొన్నాడు (Sofik SK girlfriend MMS).


సోఫిక్ ఎస్‌కే పశ్చిమ బెంగాల్‌లో ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ (Bengali influencer news). ఎమ్‌ఎమ్‌ఎస్ వివాదం మొదట చెలరేగినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అతని అనుచరుల సంఖ్య 4.63 లక్షల దగ్గరలో ఉంది. ఒక వారంలో, అతడు 5 లక్షల మంది ఫాలోవర్లను దాటేశాడు. ప్రస్తుతం అతడి మొత్తం ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు 5.02 లక్షల వద్ద ఉంది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియోను తాను పోస్ట్ చేయలేదని, వైరల్ అవడం కోసం తానే ఆ వీడియోను పోస్ట్ చేశానని అందరూ అనుకుంటున్నారని, అది పూర్తిగా అవాస్తవమవని స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి..

వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2025 | 06:58 PM