Home » Social Media
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
తమిళనాడు బోట్ల విషయంలో తనపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ బీద మస్తాన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై నేను ఏ అధికారితోనూ, గ్రామస్థులతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక చనిపోయింది.
ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కొత్త తరహా మోసం ప్రజలను మరింత ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా ఓ రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని యువతిని మోసం చేసిన వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు దర్శకుడు యువతిని కారులో ఎక్కించుకొని అసభ్యకరంగా షూట్ చేసినట్లు పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఒక ప్రధాన బెట్టింగ్ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు..
ఐరా రావత్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫొటో వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇంతకీ ఈమె ఎవరంటే..
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.