Car Dangles Mid Air: అక్కడెలా పెట్టావయ్యా.. బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయిన కారు..
ABN , Publish Date - Nov 18 , 2025 | 08:51 AM
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు బ్రిడ్జి మధ్యలోని గ్యాప్‌లో పడిపోయింది. కొన్ని గంటల పాటు గాల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. నూటికి 90 శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి. తాజాగా, ఓ కారు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై ప్రమాదానికి గురైంది. బ్రిడ్జి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్నూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కారులో నేషనల్ హైవే 66 పై వెళుతూ ఉన్నాడు. ఓ చోట బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తి ఆ బోర్డును చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపైకి దూసుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడికి అసలు విషయం అర్థమైంది. అప్పటికే పరిస్థితి అతడి చెయ్యి దాటి పోయింది. కారు బ్రిడ్జి మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. గాల్లో వేలాడుతూ ఉండిపోయింది.
ఈ ప్రమాదం గురించి పోలీసులకు వెంటనే సమాచారం వెళ్లింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో అతి కష్టం మీద కారును బయటకు తీసుకు వచ్చారు. కారును బయటకు లాగుతున్నంత సేపు లోపల ఉన్న డ్రైవర్ ప్రాణ భయంతో అల్లాడిపోయాడు. క్రేన్ ఆపరేటర్ ఎంతో చాకచక్యంగా కారును పైకి లాగాడు. దీంతో కారు డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో ఈ వ్యాయామాలు మీ శక్తిని పెంచుతాయి.!