Share News

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:10 PM

ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
Hyderabad CP Sajjanar On Cyber Crimes

హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): సైబర్ కేటుగాళ్లకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకులను సైబర్ మోసగాళ్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల (Cyber Crime)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్‌ నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. నేడు హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సీపీ సజ్జనార్.


డిజిటల్ నేరాలు, సైబర్ ఫ్రాడ్‌లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతి రోజూ లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని వివరించారు. పెట్టుబడులు పెట్టి చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా తాము అవగాహన కల్పించామని తెలిపారు. డబ్బులు ఊరికేరావని.. ఆయా యాప్‌లలో పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీపీ సజ్జనార్.


ప్రజలు ప్రధానంగా డిజిటల్ నేరాలు, సైబర్ ఫ్రాడ్‌‌ల ద్వారా మోసపోతున్నారని తెలిపారు. మరికొంతమంది ఏపీకే ఫైల్స్ వల్ల కూడా నష్టపోతున్నారని తెలిపారు. ఏ ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930 నెంబర్‌కి కాల్ చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు కోటి రూపాయలు వరకు సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏడాదికి రూ.400 కోట్ల వరకు రాష్ట్ర ప్రజల నుంచి సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2025 | 12:20 PM