Home » Cyber attack
పలువురు అమాయకులను ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.
దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.
తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి అధిక మొత్తంలో సంపాదించడం ఎలా? అనే ఓ ఇంటర్య్వూను చూసిన వృద్ధుడు అందులో ఇచ్చిన లింకును ఓపెన్ చేసి సైబర్ క్రిమినల్స్ వలకు చిక్కాడు. రూ.19 లక్షలు సమర్పించుకున్నాడు.
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి తెల్లాపూర్ రోడ్‌లోని హానర్ వివాన్టిస్లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్‌జేహెచ్‌ఎన్‌ఐ అనే నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా సైబర్‌నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
‘మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది’ అంటూ సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్ క్రైంపోలీస్ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు.
158 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ బ్రిటన్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సైబర్ దాడికి బలైపోయింది. డాటా మొత్తం పోవడంతో మరో దారి లేక కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా 700 మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.
ఇన్‌కం టాక్స్ పేయర్లను టార్గెట్ చేసిన కొన్ని సైబర్ ముఠాలు, ఐటీ రిటర్న్ పేరుతో ఫిషింగ్ మొయిల్స్‌ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్ అంటూ లింక్‌తో కూడిన మెయిల్ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.