Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్ చేయండి.. హీరోయిన్ రకుల్ ట్వీట్ వైరల్
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:29 AM
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల దారుణాలు ఎక్కువయ్యాయి. వివిధ మార్గాల్లో జనాలను బురిడీ కొట్టించి.. భారీగా డబ్బులు చోరీ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలా మంది వీరి బాధితులే. అలానే కొంతమంది నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, వారి పేరుతో బంధువులకు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా(social media fraud)కు సంబంధించి నకిలీ ఐడీలు, నకిలీ ఖాతాలతో సెలబ్రిటీల ఫాలోవర్లను దారుణంగా మోసగిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం తమ పేరుతో జరిగే మోసాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
తన వాట్సాప్ నంబరు అంటూ నకిలీ నెంబరు(fake WhatsApp chat scam)తో గుర్తుతెలియని వ్యక్తులు చాట్ చేస్తున్నారని రకుల్ తెలిపింది. ఆ నెంబర్ తో వచ్చే మెసేజులకు స్పందించవద్దంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ‘అందరికీ హాయ్... ఎవరో వాట్సాప్‌లో నా పేరుతో చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఆ నెంబర్ నాది కాదని గమనించండి . వారితో మాట్లాడకండి. వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేయండి’ అంటూ ఈ ట్వీట్ చేసింది. కాగా గత వారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు లీక్ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. ఇటీవల సెలబ్రిటీలను సైతం సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర భార్య సైతం సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!