Share News

Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్

ABN , Publish Date - Nov 25 , 2025 | 10:41 AM

టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన , సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం ఆగిపోయింది. తాజాగా వీరి వివాహం రద్దుపై పలాశ్ సోదరి పలాక్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు.

Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్
Smriti Mandhana wedding

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన గుండెనొప్పి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు మందాన తెలిపారని ఆమె మేనేజర్ ప్రకటించారు. వీరి వివాహంపై తాజాగా పలాశ్‌ సోదరి, సింగర్‌ పలాక్‌ ముచ్చల్‌ ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ షేర్‌ చేశారు. ఇరు కుటుంబాల ప్రైవసీని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


ఆదివారం రాత్రి పలాశ్‌ ముచ్చల్‌ (Palash Muchhal) కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం పలాశ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి పలాశ్‌ సోదరి పలాక్‌ ముచ్చల్‌ ఇన్‌స్టా వేదికగా స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ‘స్మృతి మంధాన నాన్నగారికి అనారోగ్యం కారణంగా, మందాన, పలాశ్‌ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఇరు కుటుంబాల గోపత్యను గౌరవించాలని కోరుతున్నా’ అని పలాక్ పేర్కొన్నారు.


మరోవైపు కొన్ని రోజుల కిందటే స్మృతి మందాన వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్‌ పాల్గొని, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.


ఇవి కూడా చదవండి:

Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

Updated Date - Nov 25 , 2025 | 11:41 AM