Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
ABN , Publish Date - Nov 25 , 2025 | 08:33 AM
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. వారికి ధీటుగా భారత్ బ్యాటర్లు ఆటలేకపోయారు. కేవలం 201 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా 288 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇదే సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు ఓ ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది. మరి.. బవుమా వేసిన ఆ ప్లాన్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
రెండో టెస్టు(South Africa vs India)లో సౌతాఫ్రికా 288 పరుగుల ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా 200 పరుగులకు పైగా ఆధిక్యం ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఫాలో-ఆన్ విధిస్తారు. కానీ ప్రొటీస్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా మాత్రం ఆ పని చేయలేదు. దీంతో క్రీడా నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బవుమా భారత్ ను ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ తామే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బవుమా(Bavuma strategy) ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం సీరీస్ ను ఎలాగైనా గెలవాలనే ఆలోచనలేనని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా(South Africa) ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండో మ్యాచ్ లో ఓడితే తప్పా... డ్రా అయినా సౌతాఫ్రికా సిరీస్‌ను గెలుచుకుంటుంది. అందుకే బవుమా భారత్(Team India)ను మరోసారి బ్యాటింగ్ పిలిచి రిస్క్ తీసుకోవాలని కాకుండా మరోసారి బ్యాటింగ్ చేస్తూ భారీ ఆధిక్యం పెట్టాలనే సురక్షితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా జట్టు నాలుగో రోజు(మంగళవారం) ఆట మూడో సెషన్ వరకు బ్యాటింగ్ చేసి, కనీసం మరో 200 పరుగులు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అదే జరిగితే వారి ఆధిక్యం 488 పరుగులు అవుతుంది. అంటే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 489 లేదా 490 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వాలనేది బవుమా వ్యూహం.
ఆ లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ క్రికెట్‌లో దాదాపు అసాధ్యం. ఈ పెద్ద టార్గెట్ వల్ల భారత్ ముందు రెండే అవకాశాలు ఉంటాయి. చివరి రోజు మొత్తం వికెట్లు పడకుండా నిలబడి, మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే రిస్క్ తీసుకుని టార్గెట్ ఛేదించడానికి ట్రై చేయాలి. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓడిన ఆశ్చర్యం లేదు. ఇలా టీమిండియాను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా మాస్టర్ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా(South Africa master plan) ఆధిక్యం 314 పరుగులకు చేరింది.
ఇవి కూడా చదవండి:
కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్
టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!