Share News

Markrams: ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టిన మార్క్‌రమ్.. వీడియో

ABN , Publish Date - Nov 25 , 2025 | 07:52 AM

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో నితీస్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను ప్రొటీస్ జట్టు ప్లేయర్ మార్క్‌రమ్ గాల్లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు.

Markrams: ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టిన మార్క్‌రమ్.. వీడియో
Aiden Markram

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా క్యాచుల విషయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. పలువురు ప్లేయర్లు పక్షిలా గాల్లో ఎగురుతూ క్యాచ్ లు అందుకున్న సంఘటనలు అనేకం చూశాం. తాజాగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కూడా అలాంటి ఓ అద్భుతం జరిగింది. ప్రొటీస్ స్టార్ ప్లేయర్ మార్క్‌రమ్(Aiden Markram) పట్టిన స్టన్నింగ్ క్యాచ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి.. ఆ సంఘటన ఏంటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఎయిడెన్ మార్క్‌రమ్(Aiden Markram) కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతమైన డైవ్‌లో ఒంటి చేత్తో అందిపుచ్చుకున్నాడు. రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ వేసిన 42వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని జాన్సెన్ షార్ట్ బాల్‌గా వేయగా.. నితీష్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతని గ్లోవ్స్‌ తాకిన బంతి గాల్లోకి లేసింది. ఈ క్రమంలో మూడో స్లిప్‌ ఫీల్డర్‌గా ఉన్న మార్క్‌రమ్ అద్భుతంగా పరుగెత్తి కుడివైపు డైవ్ చేసి బంతిని అందుకున్నాడు.


దాంతో నితీష్ కుమార్ రెడ్డి(Nitesh Kumar Reddy )(10) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ తో సహా అందరూ అవాక్కయ్యారు. 'వాటే క్యాచ్' అంటూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాక పలువురు నెటిజన్లు మార్క్‌రమ్ పై కామెంట్స్ చేస్తున్నారు. 'మార్క్‌రమ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. పోలా అదిరిపోలా!'అని కామెంట్ చేస్తున్నారు.


మ్యాచ్(South Africa vs India) విషయానికి వస్తే.. మూడో రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 26 పరుగులతో ఉంది. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్(13*), మార్క్ రమ్(12*) ఉన్నారు. దీంతో ప్రొటీస్ జట్టు 314 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆటలో వీలైన వేగంగా ఆడి.. భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచాలనే ఆలోచనలో సౌతాఫ్రికా జట్టు ఉంది. అదే జరిగితే భారత్.. గెలుపు విషయం పక్కన పెడితే.. కనీసం డ్రా కోసమైన పోరాలి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఒకరిద్దరు మినహా మిగిలిన ఎవ్వరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 201 పరుగులకే భారత్ ఆలౌటైంది.


ఇవి కూడా చదవండి:

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

Updated Date - Nov 25 , 2025 | 10:08 AM