Share News

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

ABN , Publish Date - Nov 25 , 2025 | 07:42 AM

రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన సికింద్రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

- రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

- చావుబతుకుల్లో భార్య

హైదరాబాద్: చుట్టపు చూపుగా వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భర్త మృతి చెందగా భార్య చావుబతుకుల్లో ఉంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌(Jeedimetla Police Station) పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌(Karimnagar) జిల్లా, ఇల్లంతకుంట మండలం, బిజునూర్‌ గ్రామానికి చెందిన కటంగూరి వెంకటరెడ్డి(56) భార్య లత(52)తో కలిసి పదిరోజుల క్రితం చింతల్‌ ప్రాంతంలోని సాయినగర్‌ కాలనీలో ఉంటున్న కుమార్తె దీపిక, అల్లుడు ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు.


city3.2.jpg

స్వగ్రామం వెళ్లడానికి సోమవారం ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కడానికి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో బాలానగర్‌ నుంచి జీడిమెట్ల వైపు వేగంగా వస్తున్న డీసీఎం ఆ దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన లతను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 25 , 2025 | 07:42 AM