Share News

Drinking water: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. 26న కృష్ణా జలాలు బంద్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 07:18 AM

భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 26వతేదీన కృష్ణా జలాలు బంద్‌ చేస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. విద్యుత్‌ మరమ్మతు పనుల కారణంగా కృష్ణా జలాల పంపింగ్‌ను ఆరు గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Drinking water: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. 26న కృష్ణా జలాలు బంద్‌

- నగరానికి కృష్ణా జలాలు బంద్‌

- విద్యుత్‌ మరమ్మతులతో 6 గంటలు నీటి పంపింగ్‌ నిలిపివేత

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగరానికి ఈ నెల 26న కృష్ణా జలాల బంద్‌ కానున్నాయి. విద్యుత్‌ మరమ్మతు పనుల నేపథ్యంలో కృష్ణా జలాల పంపింగ్‌ను ఆరు గంటల పాటు నిలిపివేయనున్నారు. దీంతో నగరంలో కృష్ణా జలాల(Krishna waters) సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. కృష్ణా ఫేజ్‌-1, 2, 3 పంపింగ్‌ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే బల్క్‌ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. దీంతో నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్‌(Nagarjunasagar) సమీపంలోని నాసర్లపల్లి పంపింగ్‌ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌ స్టేషన్లకు బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు.


city2.2.jpg

దీంతో చార్మినార్‌, వినయ్‌నగర్‌, బోజగుట్ట, రెడ్‌హిల్స్‌, నారాయణగూడ, ఎస్‌ఆర్‌నగర్‌, మారేడ్‌పల్లి, రియాసత్‌నగర్‌, కూకట్‌పల్లి, సాహెబ్‌నగర్‌, హయత్‌నగర్‌, సైనిక్‌పురి, ఉప్పల్‌, హఫీజ్‌పేట్‌, రాజేంద్రనగర్‌, మణికొండ(Uppal, Hafizpet, Rajendranagar, Manikonda), బోడుప్పల్‌, మీర్‌పేట్‌ డివిజన్‌ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటర్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

అది బూటకపు ఎన్‌కౌంటర్‌: ఈశ్వరయ్య

Read Latest Telangana News and National News

Updated Date - Nov 25 , 2025 | 07:18 AM