Womens Kabaddi World Cup: కబడ్డీ కిరీటం మళ్లీ మనదే
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:12 AM
డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి మహిళల కబడ్డీ వరల్డ్‌కప్ ట్రోఫీని కైవసం చేసుకొంది. సోమవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 35-28 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి విజేతగా నిలిచింది....
మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఢాకా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి మహిళల కబడ్డీ వరల్డ్‌కప్ ట్రోఫీని కైవసం చేసుకొంది. సోమవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 35-28 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన తైపీ ఆహ్వానం మేరకు భారత్ తొలి రైడ్‌కు వెళ్లి శుభారంభం చేసింది. ఆట ప్రథమార్థం ముగింపు వరకు నువ్వా-నేనా అన్నట్టు సాగగా, చివరిలో సంజు చేసిన సూపర్ రైడ్‌తో భారత్ 20-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్థంలో భారత డిఫెండర్లు పూనమ్, సొనాలీ అద్భుతమైన ట్యాకిల్స్‌తో ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేశారు. తైపీ ఒక దశలో గట్టి పోటీ ఇచ్చినా భారత్ పాయింట్ల అంతరం మాత్రం తగ్గకుండా ఆటను ముందుకు తీసుకెళ్లింది. భారత స్టార్ రైడర్ సంజూదేవి చివర్లో మరోసారి మెరవడంతో దేశానికి వరల్డ్‌కప్ దక్కింది. ఈ వరల్డ్‌క్‌పలో అద్భుత ఆటతీరు కనబర్చిన సంజూదేవికి ‘అత్యంత విలువైన క్రీడాకారిణి అవార్డు’ లభించింది. 2012లో భారత్ తొలిసారి వరల్డ్‌కప్ నెగ్గింది. ఆ తర్వాత ఈ టోర్నీ జరగడం ఇప్పుడే. మొత్తం 12 దేశాలు పాల్గొన్న ఈ లీగ్‌లో గ్రూప్ దశలో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, జర్మనీ, ఉగాండాపై నెగ్గిన భారత్ సెమీ్‌సలో ఇరాన్‌ను ఓడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News