Share News

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:48 AM

సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: అందమైన అమ్మాయిల ఫొటోలు డీపీగా పెట్టి వలపు వల విసిరిన సైబర్‌ నేరగాళ్లు యువకుడి నుంచి రూ.1.02 లక్షలు వసూలు చేశారు. యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడికి (20), టెలిగ్రామ్‌(Telegram)లో ఓ అమ్మాయి పరిచయమైంది. పెయిడ్‌ సర్వీస్‌ సేవలు అందజేస్తున్నట్లు తెలిపిన యువతి, తన ఫొటోలు పంపింది. ఫొటోలు చూసి ఆకర్షితుడైన యువకుడు పలుమార్లు చాటింగ్‌, వీడియో కాల్స్‌ చేశాడు.


city4.2.jpg

ఆమెతో గడిపేందుకు సిద్ధమైన అతడు అడ్వాన్స్‌ బుకింగ్‌, సర్వీస్‌, సెక్యూరిటీ, రూమ్‌ రిజర్వేషన్‌, రీఫండ్‌ పేరుతో పలు దఫాలుగా రూ.1.02 లక్షలు చెల్లించాడు. ఆబిడ్స్‌(Abids)లోని ఓ హోటల్‌లో రూము బుక్‌ అయిందని చెప్పగా అక్కడికి వెళ్లిన యువకుడికి ఎవరూ కనిపించలేదు. మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 02 , 2025 | 08:48 AM