Home » Cyber Crime
ఇన్స్టాగ్రామ్ లింక్‌పై నమ్మి రూ.2.46 కోట్లు కోల్పోయిన మహిళ కేసులో ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని మోసగాళ్లు నమ్మించి మోసం చేశారు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.1.22 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ టిప్స్ ఇస్తానంటూ నమ్మించి ఏకంగా.. రూ.1.22 కోట్ల కొల్లగొట్టారు. సైబర్ మోసాలపై ప్రజల్లో ఇంకా అవగాహన తక్కువగా ఉండడంతో ఈ తరహ మోసాలు నగరంలో అధికమవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఇప్పటికే వివిధ పద్దతుల్లో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న ఈ కేటుగాళ్లు తాజాగా.. నకిలీ వెబ్సైట్ సృష్టించి భక్తులను దోచుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. నగరంలోని ఓ ఏరియాకు చెందిన వృద్ధుడి(78)ని బురిడీ కొట్టించి రూ.3.99లక్షలు కొట్టేశారు. ఈ సైబర్ నేరాలపై ఇంకా ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం, సైబర్ మోసగాళ్లు పోలీసుల మాదిరిగా, బ్యాంకు అధికారుల లాగే మాట్లాడుతుండడంతో మోసపోవాల్సి వస్తోంది.
మంచి ఉద్యోగం వస్తుందని బ్రోకర్ల మాటలు నమ్మి మయన్మార్ వెళ్లి.. అక్కడ బలవంతంగా సైబర్ క్రైమ్‌లు చేస్తూ చిక్కుపోయిన నలుగురు తెలుగు యువత కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు.
ఒకటి కాదే.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు దోచేశారు. సైబర్ మోసాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా.. ప్రజల్లో ఇంకా అంత అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున నష్టపోతూనే ఉన్నారు. తాజాగా రూ52.29 లక్షలు దోచేసిన విషయం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు తెలంగాణ సైబర్ పోలీసులు 7గురు ఢిల్లీ వెళ్లారు. నేరస్థుడిని అరెస్టు చేసిన తర్వాత రాత్రి తెలంగాణ భవన్‌కు తీసుకువెళ్లారు. అక్కడే నేరస్థుడితోపాటు పోలీసులు పడుకున్నారు. తెల్లవారి లేచి చూసేసరికి పోలీసులు షాక్ తిన్నారు. నేరుస్థుడుతు పోలీసులు కళ్లుగప్పి పారిపోయాడు.
సమ్మర్ టైంలో అనేక మంది కూడా తీర్థయాత్రలతోపాటు అనేక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తుంటారు. ఇదే సమయాన్ని అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు ఫేక్ వెబ్ సైట్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.
నగరంలో సైబర్ మోసాలు పెట్రేగిపోతున్నాయి. ప్రజల ఆర్ధిక అవసరాలను అడ్డం పెట్టుకొని బ్యాంకుల నుంచి రుణాలిస్తామంటూ నమ్మబలికి ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. రూ.15లక్షల రుణం కోసం సంప్రదిస్తే నగరవాసి నుంచి రూ.44.83 లక్షలు కాజేశారు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.