Cyber Crime: డిజిటల్ డేటాపై సైబర్ కన్ను..
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:03 AM
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,
- ‘డిజిలాకర్’ పేరుతో నకిలీ యాప్‌లు
- వినియోగదారులకు సైబర్ నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ: డిజిటల్ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. అసలు/నకిలీ యాప్‌లను గుర్తించడం కష్టంగా మారుతోంది. అధికారిక మూలాల నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, అనుమానాస్పద లింక్‌లను నివారించడం ద్వారా సైబర్ మోసాల నుంచి కాపాడుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైన డిజిటల్ డేటా ఉండే డిజిలాకర్‌పై సైబర్ నేరగాళ్ల(Cyber criminals) దృష్టి పడిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ సేవలందించే డిజిలాకర్ పేరుతో నకిలీవి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇటీవల కొన్ని అనధికారిక యాప్‌లు ‘డిజిలాకర్’ మాదిరిగా ఉండి వినియోగదారుల వ్యక్తిగత పత్రాలు, ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నాయని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డిజిలాకర్ అధికారిక మొబైల్ యాప్‌ను నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ) మాత్రమే యాప్ స్టోర్‌లలో అందిస్తోంది. వాటినే వినియోగించాలని, ఇతర అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేస్తే, వ్యక్తిగత డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలు, ఆధార్ సంబంధిత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మోసపూరిత యాప్‌లు మాల్‌వేర్‌ను ఉపయోగించి ఫోన్లలోకి చొరబడవచ్చని, పాస్‌వర్డ్స్, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని చోరీ చేయవచ్చని పేర్కొంటున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు...
- స్పాన్సర్డ్ లింక్స్‌కి దూరంగా ఉండాలి. సెర్చ్ ఇంజిన్‌లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే ప్రకటనల ద్వారా వచ్చిన యాప్ లింక్స్ క్లిక్ చేయకూడదు.
- ఏదైనా యాప్ డౌన్‌లోడ్‌కు ముందు రేటింగ్స్, రివ్యూలు పరిశీలించండి. అనుమానాస్పద వ్యాఖ్యలున్న యాప్‌ల జోలికి వెళ్లొద్దు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News