Share News

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:44 AM

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

- యాప్స్‌, లోన్స్‌, ఆన్‌లైన్‌ కార్యకలాపాల ద్వారా చోరీ

- రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

- మీ డేటాతో మీకే లింకులు పంపి దోపిడీ

హైదరాబాద్‌ సిటీ: రోజుకో కొత్తరకం మోసంతో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు అమాయకులను, అత్యాశపరులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ రూ.కోటికి పైగా కొల్లగొడుతున్నారు. ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే ఏటా రూ.1500 కోట్ల విలువైన సైబర్‌ మోసాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలు చేస్తున్న క్రమంలో నేరగాళ్లు కోట్ల మంది డేటాను చోరీ చేసి స్టోర్‌ చేసుకుంటున్నారు.


ప్రమాదకరమైన వెబ్‌సైట్లకు అమ్ముకుంటున్నారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి వద్ద సుమారు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రవి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ డేటాతో ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారో అని సైబర్‌ నిపుణులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డేటా మొత్తం వినియోగదారుల అంగీకారంతోనే తీసుకోవడం గమనార్హం. ఫ్రీ సినిమా డౌన్‌లోడ్‌ మోజులో పడి, అన్ని టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను ఓకే చేయడమే డేటా చోరీకి ప్రధాన కారణం అని పోలీసులు వెల్లడించారు. ఆ డేటా తన వద్ద ఉందన్న ధైర్యంతోనే దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్‌ విసిరినట్లు తెలిసింది.


మన డేటాతో మనకే మోసం..

రోజూ గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్‌లు వస్తుంటాయి. క్రెడిట్‌ కార్డు కావాలని ఒకరు.. తక్కువ వడ్డీకే బ్యాంకు రుణమని చేస్తుంటారు. వాళ్లంరికీ నంబర్లు ఎలా తెలుసుంటే మన డేటాను క్రిమినల్స్‌ చోరీ చేసి అమ్మేశారని అర్ధమని పోలీసులు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ సర్వీసులు, డబ్బు చెల్లింపు లావాదేవీలు అందిస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న కేటుగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీచేసి సైబర్‌ నేరగాళ్లకు, ఆన్‌లైన్‌ సంస్థలకు అమ్మేసుస్తున్నారు.


city7.2.jpg

డిజిటల్‌ చెల్లింపుల మాయాజాలం

నిత్యావసర సరుకులు, కరెంటు, పాలు, పేపర్‌ బిల్లు చెల్లింపుల వరకు డిజిటల్‌గా చెల్లిస్తున్నారు. వ్యాపార లావాదేవీలకు అన్‌లైన్‌ సర్వీసులపైనే ఆధారపడుతున్నారు. ఆ క్రమంలో తమ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. కేటుగాళ్లు ఆ డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నారు.

గల్లీకో సైబర్‌ ముఠా

అడ్డదారిలో పలు సంస్థల ద్వారా సమాచారాన్ని కొనుగోలు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు వివిధ స్కీముల పేరుతో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. లక్షలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకోసం నగరాల్లో గల్లీకో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు.


అత్యాశకు పోతే అంతే..: సీపీ సజ్జనార్‌

మనిషి అత్యాశకు పోయాడంటే కచ్చితంగా మోసపోతారని గుర్తుంచుకోవాలి. ఈ సమాజంలో ఏదీ ఉచితంగా రాదు. గుర్తుతెలియని వ్యక్తులు ఉచితంగా ఏదైనా ఇస్తున్నారు అంటే సైబర్‌ మోసానికి గురవుతున్నామని తెలుసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 10:44 AM