Reels Addiction Hacks: రీల్స్ పిచ్చి నుంచి ఇలా బయటపడండి..
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:35 PM
రీల్స్ పిచ్చి నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీకు ఎంతగానో సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా అంటే ప్రస్తుతం తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సోషల్ మీడియాలోనే టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కాసేపు రీల్స్ చూద్దాం అనుకుని తెలియకుండానే గంటలు గంటలు చూస్తారు. ఏదైనా పని ఉంటే తప్ప రీల్స్ చూడటం అస్సలు ఆపరు. ఎన్ని గంటలు అయినా సరే అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటారు. అయితే, ఈ అలవాటు నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారా? ఈ రీల్స్ పిచ్చి నుంచి బయటపడటానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రీల్స్ పిచ్చి నుంచి ఇలా బయటపడండి
ముందుగా, ఎవరైతే మీకు ఎప్పుడూ రీల్స్ షేర్ చేస్తుంటారో వాళ్లకు కాల్ చేసి అసలు రీల్స్ షేర్ చేయొద్దని చెప్పండి. లేదా మీరు వారి అకౌంట్‌ను మ్యూట్‌లో పెట్టుకోండి.
రీల్స్ కనిపించే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ దృష్టి రీల్స్‌పైకి అస్సలు వెళ్లదు.
ఇన్‌స్టాను ఎంత సేపు వాడాలో మీరే ఒక టైమ్ పెట్టుకోండి. టైమర్‌ని సెట్ చేసుకోండి. ఆటోమెటిక్‌గా ఆ టైమ్ దాటితే నోటిఫికేషన్ వస్తుంది.. తద్వారా యాప్ నుంచి మీరు బయటకురావొచ్చు.
చాలా మంది ఎక్కువగా రాత్రి నిద్రపోయే ముందు రీల్స్ చూస్తారు. అయితే, రీల్స్ చూడటం వల్ల త్వరగా నిద్ర పట్టదు. అంతేకాకుండా, రీల్స్‌ను అలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. కాబట్టి, పడుకునే ముందు రీల్స్ అస్సలు చూడకండి. బదులుగా బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి.
అదే పనిగా రీల్స్ చూసే అలవాటు మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ మానసిక ఆరోగ్యానికి కూడా హానికరమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు ఈ సింపుల్ టిప్స్‌తో మీ రీల్స్ పిచ్చికి బాయ్ చెప్పండి.
Also Read:
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కారణాలు ఏంటో తెలుసుకోండి.!
శీతాకాలంలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.!
For More Lifestyle News