Home » Instagram
ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లలో ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8 నుంచి నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ తొలగింపుతో ప్రభావితమయ్యే చాట్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
లావణ్య త్రిపాఠిపై వేధింపుల కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లావణ్య త్రిపాఠిని ఆన్‌లైన్‌లో వేధించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌కు మెయిల్ పంపారు.
అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల లేఖ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించింది. తాజాగా ఖాతాను బ్యాన్ చేసింది.
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది. నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా అమ్ముతూ రోజుకు సుమారు రూ.30,000 వేల నుంచి రూ.31,000 వేల వరకు సంపాదిస్తున్నాడో భారతీయుడు. ఈయన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
మనం ఎంతో గోప్యంగా ఉంచుకునే బ్యాంక్ వివరాలు.. తినే పేపర్ ప్లేట్‌లో చూసి ఓ వ్యక్తి షాక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
గౌహతి (కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించిన మొదటి వందే భారత్ స్లీపర్ రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో పెళ్లి తర్వాత జరిగే బారాత్ లో వధూవరుల బంధువులు, స్నేహితులు చేసే హంగామా ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. డీజే సౌండ్స్, బాంబుల మోత, డ్యాన్స్ హంగామాతో ఎంతో కోలాహలంగా ఉంటుంది.
విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన మెరైన్ ఇంజనీర్.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లొంగదీసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్ట్ చేశారు.