Meta Teen policy: టీనేజర్లకు ఇన్‌స్టా షాక్.. పీజీ 13 కంటెంట్..
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:03 AM
ఇన్ స్టా తాజా నిర్ణయంతో టీనేజర్లు 13 ఏళ్ల వయసు లోపు వాళ్లు చూడగలిగే కంటెంట్, వీడియోలు మాత్రమే చూసేలా మార్పులు చేశారు. అంతకు మించిన కంటెంట్ చూడాలంటే వారి తల్లితండ్రుల అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
నేటి యువతపై సోషల్ మీడియా, ఓటీటీల కంటెంట్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్ స్టాగ్రామ్(మెటా) సంచలన నిర్ణయం తీసుకుంది. యువతకు వారు చూడదగిన కంటెంట్‌ను మాత్రమే ఇకపై అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీజీ 13 కంటెంట్‌కు మాత్రమే వారిని పరిమితం చేస్తామని ఇన్ స్టాగ్రామ్ ప్రకటించింది.
ఇన్ స్టా తాజా నిర్ణయంతో టీనేజర్లు.. 13 ఏళ్ల వయసు లోపు వాళ్లు చూడగలిగే కంటెంట్, వీడియోలు మాత్రమే చూసేలా మార్పులు చేశారు. అంతకు మించిన కంటెంట్ చూడాలంటే వారి తల్లితండ్రుల అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. పీజీ 13 కంటెంట్‌లో సెక్స్, మాదకద్రవ్యాలు లేదా ప్రమాదకరమైన స్టంట్‌లు ఉండవని ఇన్ స్టా వెల్లడించింది.
టీనేజర్లు ఇన్ స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అసభ్యకరమైన భాషతో కూడిన పోస్ట్‌లను వారికి అందుబాటులో లేకుండా చేయనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు కొన్ని ప్రమాదకర స్టంట్‌లు, గంజాయి సామగ్రిని చూపించే పోస్ట్‌లు వంటి హానికరమైన ప్రవర్తనలను ప్రోత్సహించే కంటెంట్‌ను రిఫర్ చేయకపోవడం వాటిని తప్పించడం వంటివి ఉన్నాయని ఇన్ స్టా చెప్పుకొచ్చింది. గత సంవత్సరం టీనేజర్ ఖాతాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇదే పెద్ద అప్ డేట్ అని ఇన్ స్టా వెల్లడించింది. అలాగే.. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏర్పాటు చేయగల మరింత కఠినమైన సెట్టింగ్స్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది.
పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌పై నిరంతర విమర్శలను ఎదుర్కొంటున్న ఇన్ స్టా వీటి నియంత్రణలో భాగంగానే ఈ మార్పులు తెచ్చింది. టీనేజర్ల రక్షణ కోసం స్వీయ-హాని, రుగ్మతలు, ఆత్మహత్యల పోస్ట్‌లను చూపించబోమని మెటా ఇప్పటికే హామీ ఇచ్చింది. అయినా ఇప్పటికీ అలాంటి పోస్టులు కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ ఈ మార్పులు చేస్తూ.. నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్