IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
ABN , Publish Date - Nov 16 , 2025 | 02:25 PM
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది.
కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 93 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో153 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేసి.. 30 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో టాప్ స్కోర్ గా నిలిచాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ప్రొటీస్ నిర్దేశించిన 124 పరుగల లక్ష్యాన్ని చేధించలేక భారత్ బ్యాటర్లు చతికిల పడ్డారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar)92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడి పరుగులే టాప్ స్కోర్ కావడం గమన్హారం. ఫామ్ లో ఉన్న వాషింగ్టన్ సుందర్... మార్క్రమ్ బౌలింగ్‌లో హార్మర్‌కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ 26, జడేజా 18 పరుగులు చేశారు. మిగిలిన వారు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. స్వల్ప స్కోరే కదా టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్ లు బ్యాటింగ్ లో ఏమైనా అద్భుతం చేస్తారని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. అయితే వారిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
ఇక దక్షిణాఫ్రికా(South Africa) బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు తీసి.. భారత్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అలానే మార్కో 2, కేశవ్ మహారాజ్ 2, మార్ర్కామ్ 1 వికెట్ తీశారు. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ ఆడిన ప్రొటీస్ జట్టు 153 పరుగుల స్వల్ప స్కోర్ కే ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 124 పరుగుల స్వల్ప టార్గెట్ ఉండటంతో భారత్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో భారత్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్( India batting collapse) కావడంతో అతి పెద్ద పరాభవాన్ని చవి చూశారు. ఇక భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు నవంబర్ 22న గువాహటిలో జరగనుంది.
ఇవి కూడా చదవండి:
సంజూ మానసికంగా అలసిపోయాడు: ఆర్ఆర్ ఓనర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి