పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్‌కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు.
Sim Cards Misuse: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను తమ వ్యక్తిగతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Women Suicide Attempt: న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు రమేష్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇచ్చిన గడువు వరకు డబ్బులు ఇవ్వకపోగా బాధితులపైనే ముల్కనూరు పోలీస్ స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో విద్యార్థి సంఘాల నేతలను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.
Google Maps Wrong Direction: మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.
Insta Reel Family Violence: ఇన్‌స్టాగ్రామ్ రీల్ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొంగుల కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తి మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేశారు. దీంతో అతడి కాలు నుజ్జు నుజ్జు అయింది.