Local Body Elections: అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:59 AM
పంచాయతీ పోలింగ్ సమీపించడంతో అభ్యర్థు ల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులుగా సాధారణంగా కనిపించిన అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది.
గెలుస్తామో లేదోనన్న ఆందోళన
డబ్బు, మద్యం పంపిణీపైనే పూర్తి భారం
మరికొన్ని గంటల్లో తేలనున్న భవితవ్యం
జనగామ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ పోలింగ్ (Local Body Elections) సమీపించడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులుగా సాధారణంగా కనిపించిన అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. ఓ వైపు పైకి గంభీరంగా ఉన్నా లోలోపల మాత్రం తీవ్రమైన ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ పూర్తయి గెలుపోటములు తేలనుండడంతో అభ్యర్థులు క్షణాలు లెక్కపెట్టుకుంటున్నారు.
తమ ప్రచార సరళి, ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకున్నాయన్న దానిపై సన్నిహితులు, అనుచరులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ముగియడంతో ఇక పూర్తిగా ప్రలోభాలపైనే దృష్టి సారించారు. అభ్యర్థులు ఈపాటికే సిద్ధంగా ఉంచుకున్న మద్యం, డబ్బు నిల్వలను బయటకు తీశారు. తమకు అత్యంత నమ్మకస్తుల ద్వారా డబ్బు పంపిణీని ప్రారంభించారు. కొన్ని చోట్ల బుధవారం మధ్యాహ్నం నుం చే ప్రారంభం కాగా, ఎక్కువ చోట్ల బుధవారం అర్ధరాత్రి సమయంలో డబ్బు, మద్యం పంపిణీ సాగింది. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు చిక్కకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం పంపిణీ చేశారు.
పోలింగ్ సమీపించడంతో అభ్యర్థులంతా డబ్బు, మద్యం పంపిణీ మీదే పూర్తిగా భారం వేశారు. కొన్ని చోట్ల తమ ప్రచార సరళి, సానుభూతి తమ ను గెలిపిస్తాయని నమ్ముతుండగా, కొందరు మాత్రం డబ్బు, మద్యం పంపిణీయే తమకు పట్టం కడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటలతో పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
మేజర్ గ్రామాలు మినహా చాలా వర కు గ్రామాల్లో సాయంత్రం 5 గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు అభ్యర్థులు ఆందోళనతో ఉండగా ప్రజలు ఉ త్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామానికి కాబోయే కొత్త నాయకుడు ఎవరవుతారన్న దానిపై ఆసక్తితో ఉన్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపై గ్రామాల్లో ఊహాగానాలు చక్క ర్లు కొడుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. కాగా.. మరికొన్ని గంటల్లోనే మొదటి విడత పంచాయతీ అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేలనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Read Latest Telangana News and National News