Home » CM Revanth Reddy
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తొమ్మిది కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతోపాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది.
ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండినవారు కుర్చీ వదలాలన్న ఆర్‌ఎ్‌సఎస్ నిబంధన మోదీకి వర్తించదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఐదు వందల సార్లయినా ఢిల్లీ వెళ్లి వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
ఢిల్లీ యాత్రల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్ధ శతకం కొట్టారు తప్ప రాష్ట్రానికి నయా పైసా లాభం చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బీజేపీతో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ప్రజలకు ముఖం చూపించలేక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లుడు.. కాంగ్రెస్ పెద్దల కాళ్లు మొక్కుడు చేస్తున్నాడని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ రవీందర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పలు జర్నలిస్టు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది.
పంచాయతీ రాజ్ అధికారులు సమయపాలన పాటిస్తూ.. విధుల నుంచి డుమ్మాలు కొట్టకుండా, గ్రామాల్లో సేవలు అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ యాప్) విధానాన్ని అమలులోకి తెచ్చింది.