Home » PM Modi
అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సంక్షోభంలోనూ ఇండియాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్నో దేశాలు ఇంధన, వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో చమురు సంక్షోభం మరింత ఎక్కువగా ఉంది.
ప్రస్తుత యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదనీ, ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని గత పాలకులు భయపడుతుండేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2004 - 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేమికి ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.